సాయి ఒకసారి భక్తులతో కలిసి ద్వారకామాయి ముందు వేప చెట్టు క్రింద రాయిపై కూర్చున్నాడు .
మహాల్సాపతి , నానా చందోర్కర్ , భాయిజాభాయి , శ్యామ తదితరులందరూ ఆసక్తిగా బాబా ఏమి చెప్తాడ అని ఎదురుచూస్తున్నారు . బాబా ధ్యానంలో ఉన్నారు , గాలిలో లెక్కలు వేస్తున్నారు అదే సమయంలో గట్టిగ ఎవరో " ఏయ్ పకీర్ " అని అన్నారు.
భక్తులంత ఆశ్చర్యంతో చూస్తున్నారు . బాబా అపుడే కళ్ళు తెరిచారు ఎదురుగా నానావళి , చింపిరి జుట్టు , భుజంపై మాసిన గొంగలి , పెరిగిన గడ్డం , కళ్ళు మాత్రం కాంతివంతంగా మెరుస్తున్నాయి .
బాబా వైపు నలుగు అడుగులు ముందుగ వేసి " కైలాసంలో శివుడిలా ఆనందిస్తున్నావ్ ? వీళ్ళంతా నీ ప్రమధగణాలు అనుకుంటున్నావా ? అని అన్నాడు .
సాయి బాబా చిన్నగా నవ్వి " సాధన చేస్తే ఎవరు అయిన శివుడే , అతన్ని నమ్ముకున్నవారు అంతా ప్రమద గణాలే నానా అని అన్నారు .
నానావళి మరో రెండు అడుగులు ముందుకు వచ్చి " నీతులు చెప్తున్నావ్ ?? జ్ఞానివి అనుకుంటున్నావా ?? అని అరిచినట్టు అన్నాడు నానావళి .
సాయిబాబా ప్రశాంతంగా " శాస్త్ర జ్ఞానం ఉన్నవాడు జ్ఞాని , అత్మానుభవం పొందినవాడు అత్మజ్ఞాని , మాయకు అతీతులైన వారు మహా జ్ఞాని , ఈ మూడింటికి అతీతమైనది ' సోహం ' అంటే శూన్యం . ఆ శున్యమే చిదానందం , అదే పరమాత్మ " అని అన్నాడు .
అక్కడ ఉన్నవారంత సాయి వైపు , నానావళి వైపు ఆశ్చర్యంగా చూస్తు వారి మధ్య జరుగుతున్న మాటల యుద్దాన్ని ఆసక్తికర సన్నివేశాన్ని చేష్టలు ఉడిగిపోయి చూస్తున్నారు .
నానా : ఇంతకి నువ్వు గురువువా ? దైవానివా ? లేక పకీరువా ?
బాబా : ' జీవో బ్రహ్మవ నాపరః ' అన్నట్టు మనం అందరం దైవ స్వరుపులమే . తనలోని దైవ స్వరూపాన్ని గుర్తించడమే ఆత్మ సాక్షాత్కారమ్. ఇతరులు అది గుర్తించినపుడు వారు అయన్నీ ' గురువుగా ' దైవంగా ఆరాధిస్తారు . నామభేదాలకు , స్వరూప భేదాలకు అతీతమైనది గురువు రూపం .
నానా : నువ్వు శాస్త్రజ్ఞుడివా ? వేదాంతివా ...?
బాబా : శాస్త్రం కళ్ళ ముందు కనపడుతున్న ఎదుటి ప్రపంచాన్ని గురించి మాత్రమె చెపుతుంది . కాని వేదాంతం ఆ ప్రపంచాన్ని ఎవరు ? ఎలా ? ఎందుకు సృష్టించారో చెపుతుంది. శాస్త్రం ప్రకృతి లోని రహస్యాలు మాత్రమే వివరిస్తే , వేదాంతం ప్రపంచాన్ని దర్శించే వ్యక్తిలోని ప్రకృతిని సహితం వివరంగా వివరిస్తుంది . ఆ రెండూ ఒకదానికొకటి బలం . విడదీయాలని చూస్తే ' శూన్యం ' మిగులుతుంది .
నానా : దేవుడు ఒక్కడే అని అంతా అంటున్నప్పుడు ఇంతమంది దేవుల్లెందుకు ? ఇన్ని పూజలేందుకు ?
బాబా : ' ఏకం సత్ , విప్రాః బహుధావదంతి ' అని వేదం చెపుతుంది. నోటిలోని వెళ్ళే నీరు , కడుపులోనికి వెళ్ళే పదార్థం ' ఒక్కటే ' కానీ దానికి ' నీరు ' అని, వాటర్ అని , తన్ని అని , వెళ్ళిం అని , పానీ అని ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తారు . తారతమ్యాలు పరమాత్మ కల్పించినవి కావు . మనం మన అవసరాల కోసం , సౌకర్యాల కోసం సృష్టించుకున్నవి , జీసస్ అన్నా ' రామ్ రహీమ్ అన్నా ' దైవం ఒక్కరే .
బాబా మాటలకు నానావళి తత్తరపడ్డాడు , ఐన తమాయించుకుని ....
నానా : చెట్టు ముందా ??? విత్తు ముందా ...???
బాబా : నానవాళి ని చిన్నపిల్లవాడిని చూసినట్టు చూసి " నిజానికి చెట్టులో నుండి విత్తనం , విత్తనం లో నుండి చెట్టు వస్తాయి , కానీ చెట్టునుండి విత్తనాలు , విత్తనాల నుండి చెట్టు రావడం అనే పద్ధతి ఎవరో పెడితేనే కదా చెట్టు విత్తనం ఒకదానికొకటి సృష్టిస్తాయి , అందుకని ఆ నియమం పెట్టిన ఆ పరమాత్మే అన్నింటికన్నా ముందు " అన్నాడు .
ఆ మాటతో నానవలి కి చిర్రెతుకోచ్చి దేవుడు అంతటా ఉన్నప్పుడు అందరికి ఎందుకు కనిపించడు ..??? అని అన్నాడు ...
వారిద్దరి మద్య జరుగుతున్న సంబాషణని ఆసక్తిగా గమనిస్తున్న భక్త బృందంలో ఆందోళన మొదలు ఐంది , సాయిబాబా కి ఎపుడు కోపం వస్తుందో తెలియదు . ఈ ప్రశ్నతో వీడి నానావళి పని ఐపోయింది అనుకున్నారు .
బాబా : " సృష్టిలో ఉన్నవన్నీ కనిపించాలంటే ఎలా కుదురుతుంది ?? నీ శరీరంలో నెత్తురు ప్రవహిస్తుంది . అది నీకు కనిపిస్తుందా ? నీలోని నీ గుండె , ఉపిరితిత్తులు , ప్రేగులు నువ్వు చుడగలుగుతున్నావా ?? అవి చూడాలంటే ఫలాన యంత్రాల ద్వారా సాధ్యమని డాక్టర్లు చెప్తారు అలాగే అంతట ఉన్న దేవుడిని చూడాలంటే ఫలాన విధంగా ప్రయత్నించాలని గురువులు, ఋషులు చెపుతారు " అని అన్నాడు ప్రశాంతంగా .
నానా : ఎం చేస్తే దేవుడు కనపడుతాడు ..???
బాబా : భూమి గుండ్రంగా ఉందని శాస్త్రం చెపుతుంది , ఎవరన్న కళ్ళతో భూమి గుండ్రంగా ఉండడం చూసామా ..? రాకెట్ల లో ఆకాశం పైకి వెళితే భూమి గుండ్రని ఆకారంలో ఉన్నతు తెలుస్తుంది . కళ్ళకెదురుగా , కాలికింద ఉన్న భూమి స్వరూపం తెలుసుకోవడానికే అంత ఎత్తుకి పోవాల్సి వచినపుడు , మనం దైవాన్ని దర్శించడానికి ఎంత ఎత్తుకి ఎదగాలి ..?? ఎంత నిష్టగా ప్రయత్నించాలి .
నానా : చేతనకు, చైతన్యానికి బేధం ఏమిటి ...??
బాబా : నిజమైన జ్ఞానం చేతన , అజ్ఞానానికి కదలిక ఏర్పడితే అది చైతన్యం .
నానా : ధర్మం అంటే ..??
బాబా : ధర్మానికి చాలా అర్ధాలు . వస్తు ధర్మాలు , కాల ధర్మాలు , జాతి ధర్మాలు , యుగ ధర్మాలు, దేహ ధర్మాలు , ధర్మాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి . ఎన్నాళ్లయినా , ఎన్నేళ్ళయినా మారనిది ' సనాతన ధర్మం '. ఆ సనాతన ధర్మాచరణే అందరికి నిత్యాచరణ కావాలి . అదే ఈ సాయి బోధన .
ఆ మాటలకు భక్తులంతా పరవశులయ్యారు . కరతాలద్వానులతో ద్వారకామాయి మారు మ్రోగింది , నానవలి మాత్రం పట్టించుకోకుండా ..
నానా : మానవజన్మ ఎందుకోసం ..???
బాబా : మానవ సేవ కోసం , పరోపకారం కోసం, గురుసేవ కోసం .....
నానా : గురుత్రయం అంటే ..???
బాబా : ఆది గురువు, పరమ గురువు , సద్గురువు .
నానా : సముద్రంకన్నా లోతు అయినది ...??
బాబా : ధర్మం
నానా : ఆకాశంకన్న ఎత్తు అయినది ..??
బాబా : ఆత్మ జ్ఞానం .
నానా : మనసుకన్న వేగం అయినది ..??
బాబా : ఆలోచన
నానా : చీకటికన్న నలుపైనది ..???
బాబా : ద్వేషం .
నానా : సుర్యునికన్న తీక్షనమైనది ..??
బాబా : అసూయ .
నానా : కష్టాలకు కారణం ..???
బాబా : కోరికలు
నానా : దైవ భక్తికి మూలం ..??
బాబా : ' శ్రద్ధా ' పరిపూర్ణమైన నమ్మకం ...
నానా : ఏదైనా సాదించాలంటే కావలసింది ..???
బాబా : ' సబూరి ' సహనం
నానా : కుబుసంలా త్యజించాల్సింది ..???
బాబా : అహంకారం .
సాయి ప్రశాంత సమాధానంతో నానావళి ముఖంలో ప్రసన్నత ఆవహించింది . బాబా చెంతకు వచ్చి రెండు చేతులు జోడించి నమస్కరించాడు .
నానా : భేష్ బాబా !.యోగులలో యోగివి నువ్వు , వేదమంత్రాలు మర్మం తెలిసిన మహా పురుషుడివి . అన్నీ తెలిసినవాడివి ఐన తామరాకు మీద నీటి బొట్టులా ఉన్నవో లేదో చూద్దామని వచ్చానుఅని నమస్కరించి వెల్లాడు
You may also like his : వేములవాడ రాజరాజేశ్వర స్వామి
అందరి ముఖాల్లో ఎన్నో సరికొత్త విషయాలు తెలుసుకున్న ఆనందం . బాబా లోని యోగితత్వం తెలుసుకున్న సంబ్రమం . బాబా నిర్వికారంగా ఏమి పట్టనట్టు తనలో తను లెక్కలు వేస్తూ కూర్చున్నాడు .
ఓం సచ్చిదానంద సమర్ధ సద్గురు మహారాజ్ కి జై.
0 comments :
Post a Comment