అథ ద్వాదశ జ్యోతిర్లింగాని
సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లిఖార్జునం !
ఉజ్జయిన్యాం మహాకాల మోంకార మమలేశ్వరం !!
పరల్యం వైద్యనాథంచ డాకిన్యాం భీమశంకరం !
సేతుబందేతు రామేశం నాగేశం దారుకావనే !!
వారాణస్యాంతు విశ్వేశం త్ర్యంబకం గౌతమీతటే !
హిమాలయేతు కేదారం ఘ్రుష్ణెశంచ శివాలయే !!
ఏతాని జ్యోతిలింగాని సాయం ప్రాతః పటేన్నరః !
సప్తజన్మ క్రుతంపాపం స్మరణెన వినశ్యతి !!
ఇతి ద్వాదశ జ్యోతిర్లింగాని సమాప్తం
1. శ్రీ సోమనాథుడు ( సౌరాష్ట్ర - గుజరాత్ )
శ్లో ॥ సౌరాష్ట్ర దేశ వసుదావకాశే
జ్యోతిర్మయం చంద్రకళా వతంసం ,
భక్తి ప్రదానాయ కృతావతారం
తం సోమనాథం శరణం ప్రపద్యే.
అర్థం : సౌరాష్ట్ర దేశంలో భూతలం మీద జీవులని వృద్ధి చేయడానికి , భక్తిని పెంచడానికి అవతరించిన చంద్రకళాధరుడు జ్యోతిర్మయుడు అయిన సొమనాధెశ్వరుణ్ణి శరణు వేడుకుంటున్నాను .
2. శ్రీ మల్లిఖార్జునుడు ( శ్రీశైలం - కర్నూలు - ఆంధ్రప్రదేశ్ )
శ్లో ॥ శ్రీశైలశృంగే వివిధ ప్రసంగే
శేషాద్రి శృంగాపి సదా వసంతం ,
తమర్జునం మల్లికా పూర్వ మేనం
నమామి సంసార సముద్ర సేతుం
అర్థం : అనేక కథలకు ఆకారమైన శ్రీశైల శిఖరంపైన సంసార సముద్రానికి వంతేనయై నిరంతరం నివసించు మల్లిఖార్జున స్వామికి నమస్కారం .
3. శ్రీ మహా కాలేశ్వరుడు ( ఉజ్జయిని - మధ్యప్రదేశ్ )
శ్లో ॥ అవంతికాయాం విహితావతరం
ముక్తి ప్రదానయచ సజ్జనానాం ,
అకాల మ్రుథ్యొహ్ పరిరక్షణార్థం ,
వందే మహాకాల మహం సురేశం .
అర్థం : పుణ్య పురుషులకు మొక్షాన్నిచేందుకు ఉజ్జయినీ నగరంలో అవతరించిన మహాకాలేశ్వరుడనే లింగమూర్తిని అకాల మృత్యువు నుంచి రక్షించమంటూ నమస్కరిస్తున్నాను .
4. శ్రీ ఓంకారేశ్వరుడు ( నర్మదా , కావేరి సంగమ ప్రదేశం _ మాన్దాత్ర ద్వీపం - మధ్యప్రదేశ్ )
శ్లో ॥ కావేరికా నర్మదయోహ్ పవిత్రౌ
సమాగమే సజ్జన తారణార్థం ,
సదైవ మాంధాత్రుపురే వసంత
మోంకార మీశం శివ మేక మీడే
అర్థం : సజ్జనులను తరింపచేయడానికి కావేరి, నర్మదా నదుల సంగమ స్థానాన మాన్దాతృపురం లో ఉండే ఓంకారేశ్వర మాహదేవున్ని కొనియాడుతున్నాను .
5. శ్రీ వైద్యనాథుడు ( పర్లి -మహారాష్ట్ర )
శ్లో : పూర్వోత్తరే పారలికాభిదానే
సదాశివం తం గిరిజా సమేతం
సురాసురారాధిక పాదపద్మ
శ్రీ వైద్యనాథం సతతం నమామి .
అర్థం : ఈశాన్య దేశంలో పారలిక (పర్లి ) అనే క్షేత్రంలో దేవతల చేత , అసురుల చేత కొలవబడే పాదపద్మములు కలవాడై , పార్వతి సమేతుడై ఉన్న శ్రీ వైధ్యనాధేశ్వరునికి సతతం ప్రనమిల్లుతున్నాను .
6. శ్రీ నాగేశ్వరుడు ( దారుకావనం - ద్వారక - గుజరాత్ )
శ్లో ॥ అమర్ధ సంజ్ఞే నగర చ రమ్యే
విభుశితాంగం వివిధై శ్చ భోగైః
సద్భుక్తి ముక్తి ప్రద మీశ మేకం
శ్రీ నాగనాథం శరణం ప్రపద్యే.
అర్థం : అమర్దమనే సుందర నగరంలో పాము పడగలతో అలంక్రుతుడై భుక్తి ముక్తులనిచ్చే శివుడు , సర్వసమర్థుడు శ్రీ నాగనాథెశ్వరుణ్ణి శరనోందుతున్నాను .
7. శ్రీ విశ్వనాథుడు ( కాశి - బెనారస్ - ఉత్తరప్రదేశ్ )
శ్లో ॥ సానంద మానందవనే వసంత
మానదకందం హృత పాపబృందం ,
వారణసీనాథ మనాథ నాథం
శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే .
అర్థం : ఆనందమునకు మూలకందమై, ఆనంద కాననం (కాశిపట్టణం ) లో ఆనందంతో నివసిస్తూ పాపబందములను తున్చివేసి అనాథలకు నాథుడైన శ్రీ కాశీ విశ్వనాథున్ని శరణు వేడుకుంటున్నాను .
8. శ్రీ కేదారేశ్వరుడు ( కేదారినాథ్ - హిమాచలప్రదేశ్ )
శ్లో ॥ హిమాద్రిపార్శ్వేపి తటే రమంతం
సం పూజ్యమానం సతతం మునీంద్రై ః
సురాసురై ర్యక్ష మహోరగాధ్యై ః
కేదారసంజ్ఞం శివ మీశ మీడే
అర్థం : హిమాలయ ప్రాంతంలో విహరిస్తూ , దేవతలు, రాక్షసులు , యక్షులు , పన్నగులు , మునివరులు పూజలను స్వీకరిస్తున్న కేదారేశ్వరుడని పేరొందిన శివుణ్ణి కొనియాడుతున్నాను .
9. శ్రీ భీమేశ్వరుడు ( పూణే - మహారాష్ట్ర )
శ్లో ॥ యోదాకిని శాకినికా సమాజే
నిషేవ్య మానః పిశితాష నైచ్చ ,
సధైవ భీమాది పద ప్రసిద్ధం
తం శంకరం భక్తి హితం నమామి
అర్థం : డాకిని , శాకిని మొదలయిన యోగినులు సమాజంలో మాంసాహారం తినే రాక్షసులతో కూడా సేవలందుకుంటూ , భక్తులకు మేలుకూర్చే భీమేశ్వర మహాదేవుడైన శివునికి ప్రణమిల్లుతున్నాను .
10. శ్రీ రామేశ్వరుడు ( రామేశ్వరం - తమిళనాడు )
శ్లో ॥ శ్రీ తామ్రపర్ణి జలరాశి యోగే
నిబధ్య సేతుం నిశి బిల్వపత్రైహ
శ్రీ రామ చంద్రేణ సమర్చితం
తం రామేశ్వరాఖ్యం సతతం నమామి .
అర్థం : శ్రీ రామచంద్రుడు తామ్రపర్ణి సాగరసంగమ ప్రదేశంలో సముద్రం మీద వంతెన నిర్మించి , రాత్రిపూట భిల్వ దళాలతో ఎవరినైతే ఆరాధించాడొ ఆ రామేశ్వరునికి మొక్కుతున్నాను .
11. శ్రీ త్ర్యంబకేశ్వరుడు ( నాసిక్ -మాహారాష్ట్ర )
శ్లో ॥ సిమ్హాద్రిపార్శ్వే పి తటే రమంతం
గోదావరి తీర పవిత్ర దేశే ,
యద్ధర్శనాత్ పాతక జననశః
ప్రజాయతే త్రయంబక మీశ మీదే .
అర్థం : సింహాచలానికి పక్కగా , గోదావరి పవిత్ర తీరాన వెలసి , దర్శన మాత్రం చేతనే పాపాలన్నింటిని హరిస్తూ రమించుచున్న త్ర్యంబకేశ్వరుణ్ణి స్తుతించుచున్నాను .
12. శ్రీ ఘ్రుష్ణేశ్వరుడు ( ఔరంగాబాద్ - మహారాష్ట్ర )
శ్లో ॥ ఏలాపురి రమ్య శివాలయే స్మిన్
సముల్లవంతం త్రిజగద్వరేణ్యం
వందే మహోధర తర్విభావం
సదాశివం తం ఘృష్ణేశ్వ రాఖ్యం
అర్థం : ఏలాపురంలోని అందమైన శివమందిరంలో మూడు లోకాలు కోరదగినవాడై , గంభీరమైన స్వభావం కలవాడై ఘృష్ణేశ్వరుడనే పేరుతో విలసిల్లుతున్న సదాశివునికి నమస్కరిస్తున్నాను .
ఫలశ్రుతి
శ్లో ॥ ఏతాని ద్వాదశ లింగాని సదైవ మర్త్యాః పటంతో మలమాన సాచ్చ ,
తే పుత్ర పౌత్రచ్చ ధనై రుధారై స్సంకీర్తి భాజః సుఖినో భవన్తి .
అర్థం : ఉదయాన్నే నిర్మలమైన మనస్సుతో ఈ పన్నెండు జ్యోతిర్లింగాలను తలచుకుని , స్తుతించే మానవులు పుత్ర , పౌత్రులతో అపార ధనసంపదతో , కీర్తి వంతులై సుఖిస్తారు .
ఇతి శ్రీ శంకరా చార్య కృత ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం సంపూర్ణం .

0 comments :
Post a Comment