శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, ప్రభాదివ్యకాయం, ప్రకీర్తి ప్రదాయం, భజే వాయుపుత్రం, భజే వాలగాత్రం, భజేహం పవిత్రం, భజే సూర్యమిత్రం, భజే రుద్రరూపమ్, భజే బ్రహ్మతెజంబటంచున్ ప్రభాతంబు సాయంత్రమీనామ సంకీర్తనల్ చేసి నీ రూపు వర్ణించి , నీ మీద నే దండకంబొక్కటింజేయ నూహించి , నీ ముర్తినిన్ గాంచి , నీ దాస దాసుండనై , రామ భక్తుండనై , నిన్ను నే గొల్చెదన్ , నీ కటాక్షంబునన్ జూచితే , వేడుకల్ జేసితే , నా మొరాలించితే , నన్ను రక్షించితే , అంజనాదేవి గర్భాన్వయాదేవ ! నిన్నెంచ నేనెంతవాడన్ దయాశాలివై జూచితే , దాతవై బ్రోచితే ,దగ్గరన్ నిల్చితే ,తొల్లి సుగ్రీవునకున్ మంత్రివై , స్వామీ కార్యార్తివై యుండి , శ్రీ రామ సౌమిత్రులన్ జూచి , వారిన్ విచారించి , సర్వేషు పూజించి , యబ్బానుజున్ బంటు గావించి , యవ్వాలినిన్ జంపి , కాకుత్ స్థ స్వామిన్ దయా దృష్టి వీక్షించి , కిష్కిందకేతెంచి , శ్రీరామ కార్యార్థివై , లంకకేతెంచియున్ , లంకినిన్ జంపియున్ , లంకనున్ గాల్చియున్ , భూమిజన్ జూచి , యానందముప్పొంగగా , నాయున్గారంభిచ్చి , యా రత్నమున్దేచ్చి , శ్రీరాముకున్నిచ్చి , సంతోషమున్ గూర్చి , సుగ్రీవుడాయంగ దాజంబ వంతాదూలం గూడి , యా సేతువున్ ధాటి , వానరన్ముకలై పెన్ముకలై దైత్యులన్ ద్రుంచగా , నా రావనుడన్థ కాలాగ్ని రూపొగ్రుడై , కోరి , యా బ్రహ్మాండమైనట్టి యా శక్తినిన్ వేసి , యా లక్ష్మనున్ మూర్చ నొందింపగా , నప్పుడే పోయి సంజీవిన్ దేచ్చి ,సౌమిత్రికిన్నిచ్చి ప్రానంభు రక్షించియున్ , కుంభ కర్ణాదులన్ వీరులణ్ భోరి , శ్రీ రామ భాణాగ్ని వారందరిన్ రావణున్ జంపగా లోకంభులానందమై యుండ నవ్వేలనన్ విభీశనాక్యున్ వేడుకన్ దోడుకన్ వచ్చి , పట్టాభిషేకంబుజేయించి , సీతా మహాదేవినిన్ దెచ్చి , శ్రీ రాముంతో జేర్చి , అయోద్యకున్ వచ్చి పట్టాభిషేకంబు సంరంభమై ఉన్న నీకన్న నాకెవ్వరున్ గూర్మి లేరంచు మన్నించినన్ రామభక్తి ప్రశస్తమ్భుగా నిన్ను నీ నామ సంకీర్తనల్ చేసినన్ పాపముల్ భాయవే , క్లేశముల్ ధీరవే , భాగ్యముల్ గల్గవే , సమ్రాజ్యముల్ సర్వ సంపద్విషేశంబులన్ గల్గవే ! వానరాకారా! ఓ భక్త మందార ! ఓ పుణ్య సంచార ! ఓ ధీర! ఓ శూర ! నీవే సమస్తన్భునన్ వజ్ర దేహమ్భునన్ దాల్చి , శ్రీ రామ శ్రీ రామ యనుచున్ మనః పూరితమై ఎప్పుడున్ తప్పకన్ జిహ్వయన్దుండినన్ దీర్గ దేహాన త్రైలోక్య సంచారివై , రామనమాంఖిత ధ్యానివై , బ్రహ్మవై , బ్రహ్మ తెజంభునన్ బుట్టి దేవా! ఓ హనుమంతా ! ఓం కార శబ్ధంభులన్ క్రూర సర్వ గ్రహానికమున్, భూత భేతాళ సంఘాది పైశాచులన్ , శాకినీ , డాకిని , మొహినిత్యాది దయ్యంభులన్ , రోమఖండంభులన్ ద్రుంచి , కాలాగ్ని రుద్రుండవై ,బ్రహ్మ ప్రభాబాసింతంభైన నీ దివ్య తేజంభునన్ జూచితే ! నా ప్రేమ పున్నారసింహ ! యటంచున్ , దయాదృష్టి వీక్షించి , నన్నేలు నా స్వామి! సదా బ్రహ్మ చారి ! నమస్తే ప్రపూర్నార్తి హారి ! ఓం నమో వాయు పుత్రా నమస్తే నమస్తే నమః
-
Blogger Comment
-
Facebook Comment
Subscribe to:
Post Comments
(
Atom
)
0 comments :
Post a Comment