తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి

http://worldhindunews.com/wp-content/uploads/2014/11/Tirupati-Balaji.jpg
ప్రాంతం - చిత్తూరు జిల్లాలోని తిరుపతి
దైవం - శ్రీనివాసుడు
ఆలయం నిర్మించిన సం -  క్రీశ 300

కలియుగంలో భక్తుల కొంగు బంగారమై కోరికలు తిర్చే ఆపదమొక్కులవాడు శ్రీవెంకటేశ్వరస్వామి.ఆయన నామం ఒక్కసారి స్మరిస్తే చాలు చేసిన పాపాలన్నీ పటాపంచలు అవుతాయి.స్వామి నామం ఒక్కసారి పఠిస్తెచాలు సర్వశూభాలు సిద్దిస్తాయి.శ్రీనివాసుని మహిమలకు అన్నమయ్య,త్యాగయ్య,వేంగమాంబ వంటి వారు తమ కిర్తనలతో లోకానికి చాటి చెప్పారు.అంతటి పరమపావనమైన స్వామి వారి గురించి ఒకసారి తెలుసుకుందాం.శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా తిరుపతిలో కొలువై వుంది.స్వామి వారిని ప్రతిరోజు లక్షలాదిమంది భక్తులు దర్శించుకుంటున్నారు.ప్రపంచంలోనే అటు ఆదాయంలోనూ ఇటు భక్తులు సందర్శించడంలోనూ రెండవ స్థానంలో ఉంది.

స్ధల పురాణం -
     కలియుగంలో ధర్మాన్ని నాలుగు పాదాల మీద నడిపించడానికి గోవిందుడు స్వయంభూవుగా వెలిసాడు.స్వామివారిసేవలో తరించడానికి దేవతలు ఏడుకొండలుగా మారారు.అవే శేషాద్రి,నిలాద్రి,గరుడాద్రి,అంజనాద్రి,నారాయణాద్రి,వృషభాద్రి,వెంకటాద్రి. ఆదిశేశుడిగా వరం ఇచ్చిన కారణంచే శ్రీనివాసుడు శేశున్ని కొండగా మార్చి ఆ కొండమిదే కొలువై ఉండి భక్తులను కాపాడుతున్నాడు అదే శేషాద్రి.
శాశానాల ప్రకారం స్వామి వారి ఆలయాన్ని క్రీశ.300లో నిర్మించారని తెలుస్తుంది.ఆ తరువాత పల్లవులు,చోళులు,విజయనగర రాజులు ఇలా ఎంతో మంది రాజవంశాల వారు ఈ ఆలయాన్ని అభివృద్ది చేస్తూ వచ్చారు.1517లో శ్రీ కృష్ణదేవరాయిలు స్వామి వారిని దర్శించి ఎన్నో విలువైన కానుకలను సమర్పించాడు.

      ఆ తరువాత ఆలయాన్ని అభివృద్ది పరచడానికి ప్రభుత్వం 1932లో తిరుమల తిరుపతి దేవస్ధానం(టి.టి.డి)ని ఏర్పాటు చేసింది.అప్పటినుండి స్వామివారి నిత్యపూజలు దగ్గరనుండి అన్ని కార్యక్రమాలను టీ.టి.డి నే చూస్తుంది. కేవలం తిరుపతి పుణ్యక్షేత్రంగానే కాకుండా పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ది చెందింది.తిరుమల చుట్టూ దట్టమైన అభయారణ్యం విస్తరించి ఉంది.ఇక్కడి కొండలు,లోయలు,సెలయెరులు మనసుకు ఎంతో అహ్లదాన్ని కలిగిస్తాయి.తిరుమల తిరుపతిలో బాలాజీ ఆలయమే కాక గోవిందరాజస్వామి ఆలయం,వరహస్వామి ఆలయం,కోదండ రామాలయం,పాపవినాశనం వంటి ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. శ్రీనివాసునికి వచ్చిన ఆదాయంలో ఆలయ అభివృద్దితోపాటు టీ.టి.డి అనేక మంచి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది.దేవాలయాలను అభివృద్ది చేయడానికి నిధులు సమకూర్చడం,హిందూ మత వ్యాప్తికి కృషి చేయడం,పేద విధ్యార్ధులకు చదువు చెప్పించడం,పేదలకు వివాహాలు జరిపించడం వంటి ఎన్నో చేపడుతుంది.  


తిరుపతిలో చుట్టూ ఉన్న ఆలయాలు -
1.శ్రీగోవిందరాజస్వామి ఆలయం - తిరుపతి
2.శ్రీకొదండరామస్వామి ఆలయం - తిరుపతి
3.శ్రీకపిలేశ్వరస్వామి ఆలయం - తిరుపతి
4.శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం - తిరుచనూరు
5.శ్రీకళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం - శ్రీనివాసమంగాపురం
6.శ్రీవేదనరసిమ్హస్వామి ఆలయం - నాగాలాపురం
7.శ్రీఅంజనేయస్వామి ఆలయం -అప్పలాయగుంట 

తిరుపతిలో దర్శించవలసిన ఆలయాలు -
1.శ్రీవరాహస్వామి ఆలయం
2.శ్రీఅంజనేయస్వామి ఆలయం
3.స్వామివారి పుష్కరిణి 

తీర్ధాలు -
1.ఆకాశగంగ తీర్ధం 2.పాపనాశనం తీర్ధం 3.కుమారధర తిర్ధం 4.పాండవ తీర్ధం 5.తుంబుర తీర్ధం 6.చక్ర తీర్ధం 7.రామకృష్ణ తీర్ధం 8.వైకుఠ తీర్ధం 9.శేష తీర్ధం 10.పసుపు తిర్ధం 11.సీతమ్మ తీర్ధం 12.జాపాని తీర్ధం 13.శంకసనాదన తీర్ధం 


వేకటేశ్వరస్వామికి నిత్యం జరిగే సేవలు -
సుప్రభాత సేవ ఉదయం 2గం ల 30ని లకు
తోమాల సేవ ఉదయం 3గం ల 30ని లకు
అర్చన ఉదయం 4గం ల 30ని లకు

ఉత్సవమూర్తికి జరుగు సేవలు -
1.కళ్యాణోత్సవం 2.ఆర్జితబ్రహ్మౌత్సవం 3.డోలోత్సవం 4.వసంతోత్సవం 5.సహస్రదీపాలంకరణ సేవ 6.ఏకాంత సేవ

బ్రహ్మౌత్సవాల సందర్భంగా స్వామివారు సర్వాలంకారభూషితుడై వివిధ రూపాలలో వివిధ వాహనాలలో దర్శనమిస్తూ తిరుమాడవీధులలో భక్తులను అలరిస్తారు. 

ఆయావాహనాల వివరాలు -
1.మొదటి రోజు ద్వజారోహణం(ఉదయం) పెదశేష వాహనం(సాయంత్రం)
2.రెండవ రోజు చినశేష వహనం హంస వాహనం
3.మూడవ రోజు సిమ్హ వాహనం ముత్యపు పందిరి వాహనం
4.నాల్గవ రోజు కల్పవృక్ష వాహనం శివభూతాల వాహనం
5.ఐదవ రోజు మొహిని అవతారం గరుడ సేవ
6.ఆరవ రోజు హనుమంత వాహనం స్వర్ణరధం,గజవాహనం
7.ఏడవ రోజు సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
8.ఎనిమిదవ రోజు రధోత్సవం అశ్వ వాహనం
9.తోమ్మిదవ రోజు పల్లకీ ఉత్సవం బంగారు తిరుచ్చి ఉత్సవం
చక్ర స్ధానం ద్వజారోహణం  


తిరుపతికి దేశంలోని అన్ని ప్రాంతాల నుండి ట్రైన్ సౌకర్యం ఉంది
తిరుపతికి దేశంలోని అన్నిప్రాంతాల నుండి రోడ్డు మార్గం కలదు. ఎ.పి.యస్.ఆర్.టి.సి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి బస్సు సౌకర్యం కలదు. 
విమానం ద్వారా తిరుపతికి చేరుకొవాలనుకునేవారు తిరుపతికి దగ్గరలోని రేణిగుంట విమానశ్రయానికి చేరుకోవాలి.అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా తిరుపతికి చేరుకొవచ్చు.
తిరుమలలో భక్తులు ఉండటానికి విలుగా టి.టి.డి కాటేజ్ లలొ వసతి సౌకర్యం కల్పిస్తుంది.ఇంకా సౌకర్యంగా కావలనుకునేవారి కోసం గెస్ట్ హౌస్ల్ కు పరిమితమైన అద్దె వసూలు చేస్తుంది. 

 గోవిందా........ గోవిందా........ గోవిందా........  
Share on Google Plus

About Bakthi Today

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments :

Post a Comment