what about godavari pushkaralu ?
Description about godavari pushkaralu
గోదావరీ పుష్కర స్నానమాచరించేప్పుడు పాటించవలసిన విధి విధానాలు.
- అన్నిటికన్నా ముందు ఓ పురోహితుణ్ణి [ అపర కర్మలు చేయించేవారిని ] నిర్ణయించుకోవడం.ఆయన చెప్పింది చెప్పినట్టు చేయడం..
- ఇంటి దగ్గర లేదా, మీ బస దగ్గర ముందుగా స్నానం చేసి మీ ఊరి అధిష్టాన దేవతను గానీ,జగన్మాతను గానీ ఉద్దేశించి ఈ శ్లోకం చదువుకోవాలి.
" సర్వదా సర్వ దేశేషు; పాతుత్వాం భువనేశ్వరీ;
మహామాయా జగధ్ధాత్రీ,; సచ్చిదానంద రూపిణీ: "
[ అన్నివేళలా, అన్ని ప్రదేశాల్లోనూ, మమ్మల్ని కాపాడు తల్లీ అని అర్ధం. }
- అంచు ఉన్న పంచె కానీ, తెల్ల లుంగీ కానీ ధరించి, స్నానానంతరం కట్టుకోవడానికి పొడి పంచె, ఉత్తరీయాలు,
స్త్రీలైతే చీరలూ, సరిపడినన్ని తువ్వాళ్ళూ సర్దుకోవాలి.
- నదికి తీసుకెళ్ళవలసిన సామాన్లు: పసుపు, కుంకుమ, అగరువత్తులు,హారతి కర్పూరం, తమలపాకులు, పోక చెక్కలు,
అరటి పళ్ళు, కొబ్బరి కాయలు, గంధము,విడి పుష్పములు, నువ్వులు, బియ్యం, అరటి ఆకులు, ఆవు పాలు, బెల్లం,
కిలోన్నరకు తక్కువ కాకుండా బియ్యపు పిండి,చెంబు, గ్లాసు, ఉద్ధరిణి,చిల్లర పైసలు, విడి రూపాయలు, దక్షిణలు, పురోహి
తుడికి సంభావన. / ముఖ్యంగా, తలకో చిటికెడు మట్టి, కాగితపు పొట్లాలలో కట్టుకుని తీసుకెళ్ళాలి.
- నదిలో స్నానానికి దిగే ముందు:ఆసనం: ఒడ్డున, ఓ దర్భాసనం గానీ, చాప గానీ వేసుకుని కూర్చుని, పురోహితుడితో, నదీ జలం తలమీద చల్లించుకోవాలి
[సంప్రోక్షణ]. శ్లోకం : " అపవిత్ర పవిత్రోవా..." ఆచమనం చేయాలి ..
శ్లోకం: ఓం కేశవాయ నమ: ఓం నారాయణాయ నమ: ఓం మాధవాయ నమ:
శ్లోకం: ఓం కేశవాయ నమ: ఓం నారాయణాయ నమ: ఓం మాధవాయ నమ:
- సంకల్పం: పప్pుజ్జ్ కుడి చేతిలో కొద్దిగా అక్షతలు తీసుకుని, ఎడమచేతి మీద కుడి చేతిని కప్పి, ఎడమ తొడమీద ఉంచుకుని [శ్రద్ధా సూచన ముద్ర] పురోహితుడు చెప్పిన ప్రకారం సంకల్పం చెప్పుకోవాలి.
- ఇంటి దగ్గర నుంచి తెచ్చిన చిటికెడు మట్టిని నదిలో వేసి, ఈ కింది శ్లోకం చదువుకోవాలి.
’ పిప్పలాద సముత్పన్నే; కృచ్చే లోక భయంకరీ;
మృత్తికాంతే మయాదత్తా; మహారార్ధం ప్రకల్పయా "
[ పిప్పలాద మహర్షి చే సృష్టించబడిన ఓ మహా శక్తీ, నాచే సమర్పింపబడిన ఈ మట్టిని తిని, నీ
ఆకలిని తీర్చుకో.. నా స్నాన ఫలితాన్ని తినెయ్యకు అని అర్ధం.]
- భర్తలైతే నదీ ప్రవాహానికి ఎదురు నిలబడి, భార్యలైతే వారికి ఎదురుగా నిలబడి [ అంటే నదీ ప్రవాహం వాలుకు ]భర్త ఉత్తరీయానికి భార్య చీర కొంగును ముడివేసి, మూడు సార్లు తలలు మునిగేలా నదిలో మునిగి తేలాలి. ఆసమయంలో ఆ నదీ వైభవాన్నీ, పుష్కర సమయంలో ఆ నది మనకు కట్టబెడుతున్న అనంతమైన పుణ్యాన్నీతలుచుకుని, కృతజ్ఞతా భావంతో నదికి నమస్కరించి ఒడ్డుకు చేరి పొడి బట్టలు కట్టుకోవాలి.
- దానాలన్నిటిలోనూ సర్వోత్తమమైనది గోదానం. సశాస్త్రీయంగా, మంత్ర పురస్సరంగా, ఆవు తోక మీద నీళ్ళు పోసిఅవి దాన గ్రహీత చేతిలో పడేలా సంకల్ప పూర్వకంగా చేసేది అసలైన గోదానం. అటు పిమ్మట అన్నదానం ఎంతోశ్రేష్టం. మిగతా దానాలన్నిటికీ వాటికి తగిన ఫలితాలు వస్తాయి. పుష్కర సమయంలో పితృ దేవతలనుద్దేశించి చేసేఏ దానమైనా అనంతమైన ఫలితాన్ని వారికీ, చేసే వారికీ కూడా లభిస్తుంది. ఎవరి శక్తి కొద్దీ వారు, పురోహితుడిసూచన మేరకు దానాలు చేసుకోవచ్చు.
- ఈ క్రతువు పూర్తయ్యేంతవరకూ ఖాళీ కడుపుతో ఉండగలిగితే మంచిది. ఉండలేని వారు కాస్త పాలూ, పళ్ళూ తీసుకోవచ్చు.
గోదావరీ పుష్కర స్నానం:చేయకూడని పనులు [ నిషిధ్ధ కర్మలు ]:
- ఎట్టి పరిస్థితుల్లోనూ, నదీ తీరాన్ని గానీ, నదీ జలాలను గానీ, మల మూత్ర విసర్జనకు వాడరాదు.
- నీటిని, చేత్తో చరచడం గానీ, కాలితో తన్నడం గానీ చేయరాదు.
- దిగంబర స్నానం చాలా దోషం. అది నీటికి అధిష్టాన దేవత అయిన వరుణుణ్ణి అవమానించినట్టు.పక్కవారికి ఇబ్బంది లేని వస్త్ర ధారణతో నదిలోకి దిగాలి.
- స్నానం చేసిన బట్టలు నదిలోగానీ, తీరంలోగానీ విడిచి పెట్టరాదు. తీసుకునేవారు ఉంటే, వారికి ఇచ్చేయడంమంచిది. [ అది వస్త్ర దానం కాదు. ]
- వస్త్రదానం చేయదలుచుకున్నవారు, నదీ జలాన్ని కొద్దిగా ఆ బట్టలమీద చల్లి, పక్కన ఉన్న ’ సువాసినుల’కు[సుమంగళులకు] ఇస్తే, అది నదికి సమర్పించినట్టే అవుతుంది.
- స్నానం చేసేవారిని ఫోటోలు తీయడం అత్యంత హేయం.
- ప్లాస్టిక్ కవర్లు గానీ, ఏ రకమైన ప్లాస్టిక్ వస్తువులను గానీ, నదీ తీరంలో విడువరాదు.స్నానానంతరం, గోమాతా నమస్కారం, గోప్రదక్షిణం, అత్యుత్తమం.పిండ ప్రదానాలు చేసేవారు, ఆ తదుపరి మళ్ళీ ఓ సారి స్నానం చేయాలి.
0 comments :
Post a Comment