dharma sandehalu in telugu 1-3

dharma sandehalu in telugu 1-3 for bakthi people

Devotional questions and answers in telugu language
  • సంవత్సరాది నాడు శుభం , అశుభం  ఏది జరిగినా అది అ సంవత్సరం అంతా అదే ఫలితం ఉంటుందంటారు నిజమెనా..?

ఈ విషయం కేవలం ఒక విశ్వాసం మాత్రమే . దీనికి ప్రామాణికం ఏ గ్రంధాలలోనూ కనిపించదు . మన పూర్వీకులు కొన్ని విషయాలను అనుభవపూర్వకంగా చెప్పారు . అవి తరతరాలుగా ఆచారాలుగా  విశ్వాసాలుగా మనం ఆచరిస్తున్నాం .ఒక రోజు చెడు జరిగిందని సంవత్సరం అంతా చేడుగానే ఉంటుందని చెప్పటం సరికాదు . సంవత్సరాది నాడు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పెద్దలు ఈ విధమైన విశ్వాసాన్ని ప్రచారం చేసి ఉంటారు . 


  • పెద్దల మాట చద్ది మూట అంటారు . 

మీకు సందేహం అక్కర్లేదు . పెద్దలమాట నిజంగానే చద్దిమూట . చద్ది అనే మాటవల్ల అదేదో పనికిరానిదిగా మీకు అనిపిస్తుండవచ్చు . పూర్వం చద్ది అంటే అమృతంతో సమానంగా భావించేవారు . అందుకనే చద్దిని అంత గొప్పగా పోల్చి చెప్పారు . అమ్మవారికి చద్ది పెడతారు . అంటే అమ్మ ప్రసాదంతో సమానంగా పెద్దలమాట భక్తితో స్వీకరించాలని కూడా అర్ధం . 

  • ఋషి పంచమి నాడు వామన పురాణం వినాలంటారు ఎందుకు ...?

ఈ పుణ్యదినాన కశ్యపుడు , భరద్వాజుడు , గౌతముడు , విశ్వామిత్రుడు ,అత్రి , జమదగ్ని , వశిష్టుడు  అనే సప్త మహర్షులను స్మరించుకోవాలని పురాణాలలో  వారికి సంభందించిన ఘట్టాలను పటణం, శ్రవణం చేయాలని పెద్దలు చెప్తారు . 
ఇక  కశ్యపుడి పుత్రుడు వామనుడు కనుక ఇలా చెప్తారు ... పురాణ శ్రవణం లేదా పటణం ఎప్పుడైనా పున్యాన్నిస్తుంది . ఇక సప్త మహర్షులకు సంబందించిన  ఘట్టాలు ఒకేచోట వాల్మీకి కృత రామాయణం లో మనకు కన్పిస్తాయి 
Share on Google Plus

About Bakthi Today

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments :

Post a Comment