72 చిక్కు ప్రశ్నలు వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు.


http://images.apherald.com/ImageStore/images/Astrology/Astrology_Subhashitam/godsrikrishna-pandavas-647x450.jpg

72 Tuff questions and answers from king dharmaraju

72 చిక్కు ప్రశ్నలు వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు.
1. సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు?
  • బ్రహ్మం 
2. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు?
  • దేవతలు
3. సూర్యుని అస్తమింపచేయునది ఏది?
  • ధర్మం 
4. సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు?
  • సత్యం
 5. మానవుడు దేనివలన శ్రోత్రియుడగును?
  • వేదం
6. దేనివలన మహత్తును పొందును?
  • తపస్సు
7. మానవునికి సహయపడునది ఏది?
  • ధైర్యం
8. మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును?
  • పెద్దలను సేవించుటవలన
9. మానవుడు మానవత్వముని ఎట్లు పొందును?
  • అధ్యయనము వలన
10. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి?
  • తపస్సువలన సాధుభావము, శిష్టాచార భ్రష్టతవం వల్ల అసాధుభావము సంభవించును.
11. మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు?
  • మౄత్యు భయమువలన
12. జీవన్మౄతుడెవరు?
  • దేవతలకూ, అతిధులకూ పితౄసేవకాదులకు పెట్టకుండా తినువాడు
13. భూమికంటె భారమైనది ఏది?
  • జనని
14. ఆకాశంకంటే పొడవైనది ఏది?
  • తండ్రి
15. గాలికంటె వేగమైనది ఏది?
  • మనస్సు
16. మానవునికి సజ్జనత్వం ఎలావస్తుంది?
  • ఇతరులు తనపట్లఏపని చేస్తే , ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో
అట్టి వానికి సజ్జనత్వం వస్తుంది)
17. తౄణం కంటె దట్టమైనది ఏది?
  • చింత
18. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది?
  • చేప
19. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు?
  • అస్త్రవిద్యచే
20. రాజ్యధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది?
  • యజ్ణ్జం చేయుటవలన
21. జన్మించియు ప్రాణంలేనిది
  • గుడ్డు
 22. రూపం ఉన్నా హౄదయం లేనిదేది?
  • రాయి
 23. మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది?
  • శరణుజొచ్చిన వారిని రక్షించక పోవడంవలన
 24. ఎల్లప్పుడూ వేగం గలదేది?
  • నది
 25. రైతుకు ఏది ముఖ్యం?
  • వాన
 26. బాటసారికి, రోగికి, గౄహస్ధునకూ, చనిపోయిన వారికి
బంధువులెవ్వరు?
  • సార్ధం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు
 27. ధర్మానికి ఆధారమేది?
  • దయ దాక్షిణ్యం
 28. కీర్తికి ఆశ్రయమేది?
  • దానం
 29. దేవలోకానికి దారి ఏది?
  • సత్యం
 30. సుఖానికి ఆధారం ఏది?
  • శీలం
 31. మనిషికి దైవిక బంధువులెవరు?
  • భార్య/భర్త
 32. మనిషికి ఆత్మ ఎవరు?
  • కూమారుడు
 33. మానవునకు జీవనాధారమేది?
  • మేఘం 
34. మనిషికి దేనివల్ల సంతసించును?
  • దానం
 35. లాభాల్లో గొప్పది ఏది?
  • ఆరోగ్యం
 36. సుఖాల్లో గొప్పది ఏది?
  • సంతోషం
 37. ధర్మాల్లో ఉత్తమమైనది ఏది?
  • అహింస
 38. దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది?
  • మనస్సు
 39. ఎవరితో సంధి శిధిలమవదు?
  • సజ్జనులతో
 40. ఎల్లప్పుడూ తౄప్తిగా పడియుండునదేది?
  • యాగకర్మ
 41. లోకానికి దిక్కు ఎవరు?
  • సత్పురుషులు
 42. అన్నోదకాలు వేనియందు ఉద్భవిస్తాయి?
  • భూమి, ఆకాశములందు
 43. లోకాన్ని కప్పివున్నది ఏది?
  • అజ్ణ్జానం
 44. శ్రాద్ధవిధికి సమయమేది?
  • బ్రాహ్మణుడు వచ్చినప్పుడు
 45. మనిషి దేనిని విడచి స్ర్వజనాదరణీయుడు, శోకరహితుడు,
ధనవంతుడు, సుఖవంతుడు అగును?
  • వరుసగా గర్వం, క్రోధం, లోభం, తౄష్ణ వడచినచో
 46. తపస్సు అంటే ఏమిటి?
  • తన వౄత్బికుల ధర్మం ఆచరించడం
 47. క్షమ అంటే ఏమిటి?
  • ద్వంద్వాలు సహించడం
 48. సిగ్గు అంటే ఏమిటి?
  • చేయరాని పనులంటే జడవడం
 49. సర్వధనియనదగు వాడెవడౌ?
  •  ప్రియాప్రియాలను సుఖ దు:ఖాలను సమంగా ఎంచువాడు
 50. జ్ణ్జానం అంటే ఏమిటి?
  • మంచి చెడ్డల్ని గుర్తించ గలగడం
 51. దయ అంటే ఏమిటి?
  • ప్రాణులన్నింటి సుఖము కోరడం
 52. అర్జవం అంటే ఏమిటి?
  • సదా సమభావం కలిగి వుండడం
 53. సోమరితనం అంటే ఏమిటి?
  • ధర్మకార్యములు చేయకుండుట
 54. దు:ఖం అంటే ఏమిటి?
  • అజ్ణ్జానం కలిగి ఉండటం 
55. ధైర్యం అంటే ఏమిటి?
  • ఇంద్రియ నిగ్రహం
 56. స్నానం అంటే ఏమిటి?
  • మనస్సులో మాలిన్యం లేకుండా  చేసుకోవడం
 57. దానం అంటే ఏమిటి?
  •  సమస్తప్రాణుల్ని రక్షించడం
 58. పండితుడెవరు?
  • ధర్మం తెలిసినవాడు
 59. మూర్ఖుడెవడు?
  • ధర్మం తెలియక అడ్డంగావాదించేవాడు
 60. ఏది కాయం?
  •  సంసారానికి కారణమైంది
 61. అహంకారం అంటే ఏమిటి?
  • అజ్ణ్జానం
 62. డంభం అంటే ఏమిటి?
  • తన గొప్పతానే చెప్పుకోవటం
 63. ధర్మం, అర్ధం, కామం ఎక్కడ కలియును?
  • తన భార్యలో, తన భర్తలో
 64. నరకం అనుభవించే వారెవరు?
  • ఆశపెట్టి దానం ఇవ్వనివాడు; వేదాల్నీ, ధర్మ శాస్త్రాల్నీ, దేవతల్నీ, పితౄదేవతల్నీ, ద్వేషించేవాడూ,దానం చెయ్యనివాడు
 65. బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది?
  • ప్రవర్తన మాత్రమే
 66. మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది?
  • మైత్రి
 67. ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు?
  • అందరి ప్రశంసలుపొంది  గొప్పవాడవుతాడు
 68. ఎక్కువమంది మిత్రులు వున్నవాడు ఏమవుతాడు?
  • సుఖపడతాడు
 69. ఎవడు సంతోషంగా ఉంటాడు?
  • అప్పులేనివాడు, తనకున్న దానిలో తిని తౄప్తి చెందేవాడు
 70. ఏది ఆశ్చర్యం?
  • ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండడం చూస్తూ మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండి పోతాననుకోవడం 
71. లోకంలో అందరికన్న ధనవంతుడెవరు?
  • ప్రియయూ అప్రియమూ, సుఖమూ దు:ఖమూ మొదలైన వాటిని
సమంగా చూసేవాడు
 72. స్ధితప్రజ్ణ్జుడని ఎవరిని ఆంటారు?
  • నిందాస్తుతులందూ, శీతోష్ణాదులందు, కలిమి లేములందూ,సుఖదు:ఖాదులందూ సముడై, లభించిన దానితో సంతౄప్తుడై అభిమాన్నని విడచి, అరిషడ్వర్గాలను జయించి స్ధిరబుద్దికలవాడైఎవరైఅతే ఉంటాడో వాని స్ధితప్రజ్ణ్జుడని ఆంటారు.
Share on Google Plus

About Bakthi Today

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments :

Post a Comment